PDPL: పెద్దపల్లి పట్టణంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సీపీఐ నాలుగవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు CPI జిల్లా కార్యదర్శి సదానందం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, CPI నేతలు కలవేణ శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు హాజరు కానున్నారు.