SRD: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు నల్లకుంట చెరువులోకి వర్షపు నీటితో పాటు హెటేరో డ్రగ్స్ పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలు కలుస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని వాపోయారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.