GDWL: వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించి, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై సీసీ కెమెరాల ద్వారా జరిమానా విధించాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.