గుర్తు తెలియని వ్యక్తులు సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్‌ను గొంతు కోసి హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడలోని నంది కమాన్ వద్ద కారులో ఉన్న సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.