MNCL: లక్షెట్టిపేట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్ సాగర్ రావు పుట్టిన రోజు పురస్కరించుకొని శనివారం పట్టణంలో రక్త దానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు ముందుకు వచ్చి రక్త దానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరీఫ్ ఉన్నారు.