KNR: కరీంనగర్ బస్టాండ్ వద్ద సార్వత్రిక సమ్మెలో భాగంగా KVPS, SFI నాయకులు బుధవారం ఆందోళన చేశారు. కేంద్రంలోని BJP సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని ఆ సంఘాల నాయకులు తిప్పారపు సురేశ్,గజ్జల శ్రీకాంత్ ఆరోపించారు. అదానీ అంబానీలకు వనరులను అప్పగిస్తూ ఆర్థిక అసమానతలను పెంచుతోందని, 4 లేబర్ కోడ్లు, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు.