NRML: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆలయ అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్ రెడ్డి భవాని జెండా ఆవిష్కరణ చేశారు. మాలాధారణ కార్యక్రమాలు రేపు ఉదయం 6 గంటలకు ఉంటాయి. ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అన్నదానం, తులాభారం, కుంకుమార్చన జరుగుతాయని ఆలయ వ్యవస్థాపకులు కొండాజి వెంకటాచారి తెలిపారు.