KMR: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు సూచించారు. శుక్రవారం బిక్కనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లను ట్యాబ్లో ఎంట్రీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి రమేష్, సొసైటీ వైస్ ఛైర్మన్ రాజిరెడ్డి పాల్గొన్నారు.