MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత నెల చేపట్టిన ఆందోళనలతో నవంబర్ 15 లోపు ఫీజు బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ నేటికి నెరవేర్చలేదని తెలిపారు.