ADB: ఇచ్చోడ మండలం తలమర్రి గ్రామ పంచాయతీలోని కోసుగూడ గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. మండల కేంద్రానికి సరైన రహదారి లేకపోవడంతో రాకపోకలకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.