NZB: సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గిర్ని చౌరస్తా వద్ద గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో బైక్పై గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వారు గడ్కోల్కు చెందిన మనీశ్, కార్తీక్, వంశీగా గుర్తించారు. బుధవారం వారిని ఆర్మూర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.