GDWL: అయిజ మండలం సంకాపురం దేవర శ్రీను కుమార్తె మల్లేశ్వరి ఉత్తనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన సీఎం కప్ రన్నింగ్ పోటీల్లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యింది. హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి రన్నింగ్ పోటీల్లో పాల్గొంటుందని HM సోమ శేఖర్ రెడ్డి సోమవారం తెలిపారు.