BDK: కంచర్ల గోపన్న 392వ జయంతి ఉత్సవాలకు భద్రాద్రి శనివారం ముస్తాబయింది. ఐదు రోజులపాటు వాగ్గేయకారోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. నేటి నుంచి 5వ తేదీ వరకు చిత్రకూట మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సంగీత, వాయిద్య కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.