NLG: నల్లగొండకు ఆపేరు ఏలా వచ్చిందో తెలుసా? నలుపు ,కొండ అనే రెండు పదాల కలయిక వలన ‘నల్లగొండ’ ఏర్పడింది. నల్లగొండలో నలుపు రంగు గల కొండ ఉండడం వలన ఈ పేరు వచ్చినట్లు పూర్వికులు చెబుతున్నారు. గతంలో నల్లగొండను నీలగిరి అని పిలిచేవారు. బహమనీ సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతాన్ని అల్లావుద్దీన్ బహమన్ షా స్వాధీనం చేసుకున్న తర్వాత పేరు నల్లగొండగా మారిందని పూర్వీకులు తెలియజేశారు.