NZB: తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కథలు, కవితలు, నాటికల విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఏర్గట్ల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జక్కని వైష్ణవికి నాటికల విభాగంలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. అలాగే కవితల విభాగంలో ప్రోత్సాహక బహుమతిని అందుకున్నట్లు పాఠశాల తెలుగు పండితుడు ప్రవీణ్ శర్మ తెలిపారు.