NRML: ఈనెల 27న హైదరాబాదులో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనే విద్యార్థులకు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ అభిలాష శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా నుంచి 550 మంది రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనబోతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారని అభినందించారు.