గ్రేటర్ HYD ప్రజలందరికీ జీహెచ్ఎంసీ అధికారులు రెయిన్ అలెర్ట్ జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 7 గంటల వరకు సైతం వర్షాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.