ADB: సోనాల మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయటం పట్ల వారిని ఎమ్మెల్యే అభినందించారు. చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.