HYD: బోయిన్పల్లి పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో నకిలీ భూమి పత్రాలు సృష్టించి, అమాయక ప్రజలను మోసం చేస్తున్న భార్యా, భర్తలు పరశురాములు, మాధవిలను అరెస్ట్ చేశారు. నార్సింగికి చెందిన ఈ దంపతులు స్కంద శ్రీ ఇన్ ఫ్రాడెవలపర్స్ పేరుతో సంస్థను నడుపుతూ, రమ్యవీణ అనే మహిళ నుంచి రూ. 22.50 లక్షలు వసూలు చేశారు.