BDK: హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకు చర్లపల్లి వరకు మాత్రమే నడుస్తున్న మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు (నం. 12745) బుధవారం నుంచి తిరిగి సికింద్రాబాద్ వరకు వెళ్లనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఈ రైలు రాకపోకలు చర్లపల్లికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.