MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ అనుబంధ జువ్విగూడలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగింది. సోమవారం గ్రామంలో అంగన్వాడి టీచర్ శ్యామల ఇందిరమ్మ ఇండ్ల సర్వేను చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ యాపులో వచ్చిన పేర్ల ఆధారంగా ఆమె వారి ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలను సేకరించారు. మంగళవారం సర్వేకు తుది గడువని, ప్రజలు పూర్తి వివరాలు ఇవ్వాలని ఈవో రాహుల్ కోరారు.