HYD: బతుకమ్మ పండుగకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వారు మాట్లాడుతూ.. పండుగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవన్నారు. ఈ బతుకమ్మ పండుగ పూటైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి, అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగను జరుపుకునేటట్టు సీఎం రేవంత్ రెడ్డి చెయ్యాలని పేర్కొన్నారు.