MDK: పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ మైదానం పనులను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైదానం నిర్మాణాన్ని వేగవంతం చేసి, పోలీస్ సిబ్బంది వినియోగానికి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మైదానం సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.