ASF: ITDA డైలీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌కు ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి వినతిపత్రం అందజేశారు. 30 ఏళ్లుగా ITDA పరిధిలో విధులు నిర్వహిస్తున్న డైలీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా ఆదివాసీలన్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమని, జీతాలు ప్రతి నెల రావడంలేదని వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.