MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ఎదుట కార్మికులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు శుక్రవారం 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4న వరంగల్లో జేఎల్సీ సమక్షంలో జరిగే చర్చల్లో కార్మికులకు క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించేందుకు యాజమాన్యం ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.