NGKL: తాడూరు మండలం గోవిందాయపల్లిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని గురువారం సాయంత్రం రైతులు తమ ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించి, స్థానిక హనుమాన్ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యేక వేడుక నిర్వహించారు. పంటలు చేతికి వచ్చిన ఆనందంలో రైతులు, మహిళలు సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు.