TPT: తుమ్మలగుంటలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పశుసంపద సంరక్షణ నిమిత్తం సంప్రదాయ బద్దంగా నిర్వహించిన పార్వేట ఉత్సవం ఎంతో వేడుకగా సాగింది. వేదం, గోవిందుని సంకీర్తనలు ఆలపించి పార్వేటను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరాధనం, నివేదన, హారతులు పట్టారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకన్న పంచ ఆయుధాలతో ఊరేగింపు చేశారు.