KMM: అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని Dy. CM భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం అనుకున్న లబ్ధిదారునికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.