NRML: బుధవారం పిఎంకె గ్రూప్ (ఇథనాల్ ఫ్యాక్టరీ) వారు దిలావర్పూర్ మండలం బన్సపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, షూ పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం వారు ఇచ్చిన పుస్తకాలు, షూలను తిరిగి వారికి ఇచ్చేశారు. వారు మాట్లాడుతూ.. మీరు ఇచ్చే సహాయం మాకు వద్దని ఫ్యాక్టరీని ఇక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు.