PDPL: గోదావరిఖని గణేశ్నగర్కు చెందిన నాగవెల్లి సత్యనారాయణ ఆదివారం పట్టణ శివారులోని గోదావరి నది బ్రిడ్జి నుంచి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నదిలోకి దూకి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నదిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.