MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని కమలాపురం వైపు వెళ్లే రహదారి గుంతలగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సురక్షిత ప్రయాణం కష్టంగా మారిందని, అధికారులు తక్షణం మరమ్మతులు చేపట్టాలని ఆదివారం డిమాండ్ చేశారు.