JN: జిల్లా జఫర్ఘడ్ మండలంలోని TGSWRS పాఠశాలలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ N.వరలక్ష్మి, ఉపాధ్యాయ బృందం పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే మహనీయుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. నిజాంపాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన చారిత్రక సందర్భాన్ని వారు విద్యార్థులకు వివరించి, వారి త్యాగాలను నిత్యం స్మరించుకోవాలని తెలిపారు.