వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. ‘సహకార సంఘాల ప్రాముఖ్యత, సమాజంపై ప్రభావం’ అంశంపై జరిగిన ఈ పోటీలో ఎం.లక్ష్మీనారాయణ, ఎంఏ.అబిద్, కె.భాస్కర్ విజేతలుగా నిలిచారు. జిల్లా సహకార అధికారి రాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ రిజిస్ట్రార్ ఎం.ప్రసాదరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.