KMM: పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఏదులాపురం సొసైటీ ఛైర్మన్ జర్పుల లక్ష్మణ్ నాయక్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న మిషన్లతో వరి ధాన్యం తేమ శాతాన్ని సొసైటీ ఛైర్మన్ పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలని సొసైటీ ఛైర్మన్ పేర్కొన్నారు.