SDPT: ఉరేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన ములుగు మండలం బహిలంపూర్లో శుక్రవారం జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ వివరాలు.. వర్గల్ మండలంలోని మైలారానికి చెందిన భాను(22) భార్య మూడు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న భాను 26న బహిలంపూర్ బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.