MHBD: మహిళా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. కురవి మండల కేంద్రంలో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో MLA పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సద్వినియోపరుచుకోవాలని ఆయన కోరారు.