BDK: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజనల్ కార్యదర్శి సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చర్ల మండలం ఊంజుపల్లి హాస్టల్ కార్మికులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు.