WNP: శ్రీరంగపూర్ మండల కేంద్రంలోని వెంకటాపూర్ ఎక్స్ రోడ్డు నందు శ్రీరంగపూర్ పోలీసులు ఈరోజు సాయంత్రం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఏఎస్ఐ మన్యపు రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు కోడ్ అమలులో ఉన్నందున రూ.50 వేల నగదుకు మించి ఎక్కువ తీసుకెళ్లరాదని, తీసుకెళ్తే సరైన పత్రాలు ఆధారాలు చూపించాలన్నారు. అలాగే విలువైన వస్తువులు కూడా ఎక్కువగా తీసుకెళ్లరాదని వారు సూచించారు.