MDK: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 వరకు BNS 163 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఆదేశాల ప్రకారం నలుగురు, అంతకంటే ఎక్కువ గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.