ASF: ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి శుక్రవారం అయ్యప్ప మాలధారణ చేశారు. అత్యంత పవిత్రమైన ఈ దీక్షను స్వీకరించడం ద్వారా స్వామివారి పట్ల తనకున్న భక్తిని ఆమె చాటుకున్నారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. గురుస్వామి చేతుల మీదుగా భర్తతోపాటు MLA అయ్యప్ప స్వామి మాలను ధరించారు.