KMR: పిట్లం మండలంలోని తిమ్మానగర్ గ్రామానికి చెందిన విద్యార్థిని సాయిస్మరణ శ్రీరామ నవమినిపురస్కరించుకొని ఆకుపై సీతారాముడి చిత్రాలను చూడముచ్చటగా గీసింది. పిట్లంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాయిస్మరణ గతంలో ట్యాబ్లెట్లపై, ఆకులపై అందమైన చిత్రాలు గీసింది. చదువుతోపాటు చిత్రకళారంగంలో విద్యార్థిని రాణించడంతో ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.