JGL: ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాలలో మేలో 12 రోజులు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 12 మందిలో అశ్విని ఒకరు కావడం విశేషం.