NLG: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం తీసుకొచ్చింది. గతంలో అంగన్వాడీ లబ్ధిదారులకు అందించే సరుకుల విషయంలో జాబితాలో పేర్లు ఒకరివి ఉంటే మరొకరికి ఇస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది.