ADB: నెరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తానని ఎవరు అదైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.