HYD: దేవీ నవరాత్రులను పురస్కరించుకొని 7వ రోజు ఆదివారం జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి స్కందమాతా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.