వనపర్తి: ఫార్మా కంపెనీకి భూసేకరణకు రైతు అభిప్రాయాలను తెలుసుకునేందుకు లగ్చర్ల వెళ్లిన వికారాబాద్ కలెక్టర్, ఇతర ఉద్యోగులపై దాడి, కార్ల ధ్వంసం హేయమైన చర్య అని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టుమీది భాను ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రషీద్ అన్నారు. దాడిని ఖండించారు. మాట్లాడుతూ.. ఘటనకు కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.