MBNR: రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో కుల వృత్తుల పునరుద్ధరణ జరిగిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాక కర్ణాటక ,తెలంగాణలో కులవృత్తులు నాశనమయ్యాయి అన్నారు. తెలంగాణ తరహాలో కర్ణాటకలో కులవృత్తులు పునరుద్ధరణ చేయాలని స్వామీజీల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో మాజీమంత్రి పాల్గొని మాట్లాడారు.