KMM: తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మండల పరిధిలోని పాత మిట్టపల్లి నుంచి నారయ్య బంజర వెళ్లే దారిలో రోడ్డుపై స్థానికులు గుర్తించారు. క్షుద్ర పూజలు జరిగిన చోట నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తినుబండారాలు, మల్లె పూలు, ముగ్గులు, వేసి ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు క్షుద్ర పూజలు చేసినట్లు తెలిపారు.