ADB: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పిల్లలు చైనా మాంజ వాడకుండా, న్యాచురల్ దారాలను వాడాలని జీడీపల్లె FSO ముంతాజ్, FBO రాధే శ్యామ్ అన్నారు. శుక్రవారం సోనాల మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో చైనా మాంజాపై అవగాహన కల్పించారు. చైనా మాంజా కారణంగా బైక్పై ప్రయాణించే వ్యక్తులకు, పక్షులకు కలిగే దుష్పరినామాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉన్నారు.