SDPT: జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని CP అనురాధ తెలిపారు. నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్ 8712667100కు ఫోన్ చేయాలని చెప్పారు.